హోం క్వారంటైన్‌లోకి కవిత

mlc kavita home quarantined సోమవారం విడుదలైన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఘనవిజయం సాధించిన కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన ‌జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌‌గా‌ నిర్దారణ కావడంతో, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.



ముందుజాగ్రత్తగా ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు తాను అందుబాటులో ఉండటంలేదని మంగళవారం కవిత ట్వీట్ చేశారు. కరోనా బారిన ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ త్వరగా కోలుకోవాలని కవిత ఆకాంక్షించారు.