CM KCR : ఏపీలో కరెంట్ ఉండదు, తెలంగాణకు వలస వస్తున్నారు- సీఎం కేసీఆర్

CM KCR : దళారులు మోపయ్యారు. ఎన్నడూ పని చేయనివారు నేడు మళ్ళీ వస్తున్నారు. ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.

CM KCR – Gadwal : జోగులంబ గద్వాల జిల్లాలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెబుతూ మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తెచ్చారు. ఏపీలో 24 గంటలు కరెంట్ ఉండదన్నారు కేసీఆర్. అంతేకాదు పొరుగు రాష్ట్రాల ప్రజలు తెలంగాణకు వలస వస్తున్నారని చెప్పారు. ఏపీ గురించి ప్రస్తావన తెచ్చి మరోసారి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హీట్ పెంచారు కేసీఆర్.

”తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. ఒకనాడు చాలా కష్టాల్లో మునిగిపోయి గంజి కేంద్రాలు పెట్టిన ప్రాంతం పాలమూరు జిల్లా. జోగులాంబ గద్వాలలో పాదయాత్రలో అప్పటి దృశ్యాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక పరిపాలన సంస్కరణలు చేపట్టాం. అందులో భాగంగానే జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం.

Also Read..Kuchadi Srihari Rao : నన్ను మోసం చేశారు.. కాంగ్రెస్‌లోకి సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడు

జిల్లా ప్రజలకు జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని జిల్లా పేరు పెట్టుకున్నాం. అందరినీ అదుకుంటున్నాం. దళిత, గిరిజన, బీసీ బిడ్డలు బాగా చదువుకుంటున్నారు. ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్య నాయకులు ఉద్యమకారులే. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. విద్యుత్, రైతుబంధు ఇస్తున్నాం. పాలమూరులో ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు.

మహబూబ్ నగర్ లో 14 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. అనేక రకాల బాధలు ఈ జిల్లా ప్రజలు అనుభవించారు. పక్క రాష్ట్రాల నుండి ప్రజలు వలస వస్తున్నారు. పక్కనే ఉన్న ఏపీలో 24గంటల కరెంట్ ఉండదు. దళారులు మోపయ్యారు. ఎన్నడూ పని చేయనివారు నేడు మళ్ళీ వస్తున్నారు. ధరణి తీసేసి బంగాళాఖాతంలో వేస్తా అంటున్నారు.

Also Read..Telangana Politics : తెలంగాణ అడ్డాలో బీఆర్‌ఎస్ పార్టీని ఢీకొట్టే మొనగాడు ఎవరు.. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్.. కొత్త టీంతో బీజేపీ?

కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలి. పాలమూరు ఎట్లా మారిందని చూడటానికి బస్సులో వచ్చినా. 255 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలు మంజూరు చేస్తున్నా. మండల కేంద్రానికి రూ.15 లక్షలు, గద్వాల్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, మిగత మూడు మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు కేటాయిస్తున్నాం” అని సీఎం కేసీఆర్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు