ఇళ్లను ఖాళీ చేయండి..! మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక..

మూసీ పరివాహక ప్రాంతాలైన చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసానగర్ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశాయి.

Musi River : జంట నగరాల్లోని జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. జలాశయాలన్నీ నిండకుండలా మారడంతో ఏ క్షణమైనా జలాశయాల గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలైన చాదర్ ఘాట్, శంకర్ నగర్, మూసానగర్ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశాయి. అలాగే రెండు రోజుల్లోగా తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

Also Read : కష్టాలు పునరావృతం కాకూడదని కేసీఆర్ నవగ్రహ యాగం.. పూర్తి వివరాలు

మరోవైపు తెలంగాణను వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోసారి రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాగల 3 రోజులు భారీ వానలు పడతాయంది. ఈ నెల 8న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. 9, 10వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 8న కరీంగనర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వానలు పడతాయంది. 9న ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో.. 10వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వానలు పడతాయంది. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, నిర్మల్, ములుగులో కుండపోత వానలు పడొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు