×
Ad

Adilabad : పిడుగు పడి రైతు, జోడెద్దులు మృతి

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది

  • Published On : July 7, 2021 / 09:25 PM IST

Adilabad Lightning

Adilabad : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కుచులపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.ఈ రోజు సాయంత్రం ఉరుములు మెరుపులుతో కూడిన భారీ వర్షానికి పొలంలో పని చేస్తున్న రైతుతో పాటు వ్యవసాయ కూలీలు పొలంలోని వేప చెట్టు క్రిందకు వెళ్లారు.

అందరూ చెట్టుకిందకు చేరినప్పుడు అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు రైతు కారం లక్ష్మణ్ తో పాటు ఆయన జోడెద్దులు మృతి చెందాయి. మిగతా వ్యవసాయ కూలీల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.