Onion Price Hike: షాకిస్తున్న ఉల్లి ధరలు.. వారం రోజుల్లోనే డబుల్.. మరింతగా పెరిగే అవకాశం ఉందా?

ఉల్లిపాయ ధరలు(Onion Price Hike) రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Onion price hike in hyderabad retail rate cross 50 rupees per kg

  • ఆకాశాన్నంటిన ఉల్లిపాయల ధరలు
  • రిటైల్‌లో కేజీ రూ.50 పైనే
  • తగ్గిన దిగుమతులే ప్రధాన కారణం

Onion Price Hike: రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు సామాన్యులకు తీవ్ర భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే ఉల్లిపాయ ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. చాదర్‌ఘాట్, మలక్‌పేట్ వంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్లలో ఇదివరకు క్వింటా రూ.2,500 నుంచి రూ.3,000 వరకు ఉండగా, ప్రస్తుతం అది ఏకంగా రూ.4,500 నుంచి రూ.5,500 వరకు చేరిందని అధికారులు వెల్లడించారు.

Poopa Reddy Murder Case: పదో తరగతి విద్యార్థులే చంపేశారు.. ప్రిన్సిపాల్ హత్య కేసు ఛేదింపు.. విచారణలో సంచలన విషయాలు

రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.50 దాటిన వైనం:

హోల్‌సేల్ మార్కెట్లలో ధరల పెరుగుదల ప్రభావం రిటైల్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో ఉల్లిపాయల (Onion Price Hike)ధర రూ.50 నుంచి రూ.55 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల బడ్జెట్ తలకిందులవుతోంది.

తగ్గిన దిగుమతులే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం:

ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన ఉల్లి దిగుమతులు నిలిచిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని వ్యాపారులు చెప్తున్నారు. సాధారణంగా కర్నూలు నుంచి రోజుకు 10 లారీలు, మహారాష్ట్ర నుంచి 20 లారీల ఉల్లి మలక్‌పేట మార్కెట్‌కు వచ్చేది. అయితే అక్కడి ప్రభుత్వాలు పంటల సాగుపై ఆంక్షలు విధించడం, ఎగుమతులు తగ్గడంతో దిగుమతులు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో కూడా ధరలు మరిన్ని పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.