BRS MLAs : కేంద్రం నిబంధనల ప్రకారమే ఓఆర్ఆర్ బిడ్డింగ్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఆర్ఆర్ఆర్ టెండర్ మాత్రమే కాదు.. బీజేపీ చేసిన ఏ ఆరోపణకైనా కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. కేటీఆర్ కు వస్తున్న ఇమేజ్ ను చూసి తట్టుకోలేక బీజేపీ ఆరోపణలు చేస్తోందన్నారు.

BRS MLAs (1)

BRS MLAs : ఓఆర్ఆర్ బిడ్డింగ్ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఓర్ఆర్ఆర్ బిడ్డింగ్ దక్కించుకున్న సంస్థ…పూణే టోల్ బిడ్డింగ్ ను దక్కించుకుందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక విధానం…ఇతర ప్రభుత్వ పాలిత రాష్ట్రాల్లో మరో విధానం ఉంటుందా? అని ప్రశ్నించారు.

ఓఆర్ఆర్ బిడ్డింగ్ పై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సీబీఐ లేదా ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తుకు తాము సిద్ధమని, మరి మీరు సిద్ధమా అని కేంద్రాన్ని సవాల్ చేశారు. అదానీ పోర్ట్ ఇల్లీగల్ వ్యవహారాలపై దర్యాప్తు డిమాండ్ కు కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదన్నారు.

Karnataka Election 2023 : ఈవీఎంలు పగులగొట్టి ఎన్నికల సిబ్బందిపై దాడి .. ఎందుకంటే..

ఓఆర్ఆర్ టెండర్ మాత్రమే కాదు.. బీజేపీ చేసిన ఏ ఆరోపణకైనా కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేశారని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు. కేటీఆర్ కు వస్తున్న ఇమేజ్ ను చూసి తట్టుకోలేక బీజేపీ ఆరోపణలు చేస్తోందన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ కు రైతాంగం నుంచి కనీస స్పందన లేదని విమర్శించారు.

ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ పై పసలేదని పేర్కొన్నారు. రాష్ట్ర నేతలతో సరిపోదు కాబట్టి…జాతీయ నాయకులను తెలంగాణ రప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. డిక్లరేషన్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలో జాతీయ పార్టీలు విఫలం కాబోతున్నాయని పేర్కొన్నారు.