Padi Kaushik Reddy
MLC Kaushik Reddy: హుజరాబాద్ నియోజకవర్గంలో త్వరలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. శాసన సభ్యుడిగా గెలిస్తే 1000 కోట్లతో హుజురాబాద్ అభివృద్ధి చేస్తా నని అన్నారు. మినీ కలెక్టరేట్ ,మోడల్ చెరువును టూరిజం స్పాట్‌గా మలుస్తామని చెప్పారు. హుజురాబాద్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ హుజురాబాద్‌లో ఉంటుందని కౌశిక్ రెడ్డి చెప్పారు. అందులో సీఎంతో పనులన్నింటికి ఎండర్స్ చేపిస్తానని చెప్పారు.
Kodali Nani: కొడాలి నాని, మరో ఇద్దరు నేతలకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు.. ఎందుకంటే?
కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే ఏం లాభం..? అని స్థానిక ప్రజలను ప్రశ్నించారు. నాకు కోపం ఎక్కువ అని పుకార్లు కొందరు చేస్తున్నారు.. పనుల కోసమే అధికారులని అడిగా, అదీ ప్రజల కోసమే అని కౌశిక్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ నాకు అండగా ఉన్నారు.. ఆ అండను హుజురాబాద్ అభివృద్ధికి ఉపయోగిస్తానని చెప్పారు. హుజురాబాద్ జిల్లా కాకుండా మాజీ మంత్రి అడ్డుకున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ లో హుజూరాబాద్ జిల్లా అవుతుందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.