Moinabad Farm House Party: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం.. ఈగల్ టీమ్ అదుపులో ఏపీ టీడీపీ ఎంపీ..?
డ్రగ్స్ పార్టీ సమాచారం తెలిసి ఈగల్ టీమ్ సోదాలకు వెళ్లింది. అయితే, యువకులు ఈగల్ టీమ్‌ను అడ్డుకుని హంగామా చేశారు.
- Naveen
- Published On : March 15, 2026 / 12:12 AM IST
Moinabad Farm House Party
Moinabad Farm House Party: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడ డ్రగ్స్ పారీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీమ్ దాడులు చేసింది. సోదాల సమయంలో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న యువకులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈగల్ టీమ్ డ్రగ్స్ పార్టీ 8మందిని అదుపులోకి తీసుకుంది. స్పాట్ లో రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీ చేసుకున్న ఫామ్ హౌస్ ఓ మాజీ ఎమ్మెల్యేకి చెందినదిగా గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో రాజకీయ నేతలు ఉన్నట్లు సమాచారం. అటు ఓ మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ పార్టీ సమాచారం తెలిసి ఈగల్ టీమ్ సోదాలకు వెళ్లింది. అయితే, యువకులు ఈగల్ టీమ్‌ను అడ్డుకుని హంగామా చేశారు. డ్రగ్ పార్టీలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది ఈగల్ టీమ్. సమాచారం తెలిసిన వెంటనే ఎస్వోటీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఈ డ్రగ్స్ పార్టీలో ఓ ప్రజాప్రతినిధితో పాటు 8 వీఐపీలు ఉన్నట్లు సమాచారం. సోదాల సమయంలో అక్కడే ఉన్న ఏపీ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ ను ఈగల్ టీమ్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అదుపులో ఉన్న 8 మందికి యూరిన్ టెస్ట్ చేసింది ఈగల్ టీమ్. రిపోర్ట్ వచ్చాక 8మందిలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
