TGSRTC Discount : పెట్రోల్, డీజిల్ కొరత.. శుభవార్త చెప్పిన తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు బంపరాఫర్

TGSRTC Discount : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఏసీ, డీలక్స్ బస్సులల్లో డిస్కౌంట్ ప్రకటించింది.

petrol shortage in hyderabad tgsrtc offers 30 discount on ac deluxe buses

TGSRTC Discount : ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో మన దేశంలో ఎల్పీజీ కొరత, ఇంధన కొరత ఏర్పడి.. జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో వేచి నిలబడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ నగర పరిధిలోని డీలక్స్, మెట్రో ఏసీ బస్సుల్లో 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులకు తక్కువ ధరకే సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించేందుకు ముందుకు వచ్చింది. నగర వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సంస్థ ఎండీ నాగిరెడ్డి ప్రకటించారు.

ఆర్టీసీ బస్సులు ఉండగా.. పెట్రోల్ కోసం ఇబ్బందులు పడటం ఎందుకు దండగ.. అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రయాణికులు తక్కువ ధరకే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ కోసం.. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడి ఇబ్బంది పడవద్దని.. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సూచించారు. పెట్రోల్ కోసం ఎదురుచూసే బదులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మేలన్నారు.

ప్రజలు వ్యక్తిగత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాను ఆశ్రయిస్తే.. ఇంధనం ఆదా అవుతుందని.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా తోడ్పాటు అందిస్తుందన్నారు. రోడ్ల మీద వాహనాల రద్దీ తగ్గడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని నాగిరెడ్డి తెలిపారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని.. జనాలు కంగారు పడవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై అధికారులతో చర్చించనున్నారు.