ప్రణీత్‌రావు కేసులో మరో సంచలనం.. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు

Phone tapping case: కేసులో మెమో జారీ చేశారు పోలీసులు. అధికారికంగా ట్యాపింగ్‌ కేసు నమోదు చేశారు.

Telangana Phone tapping case: ఫోన్ ట్యాపింగ్, డేటాబేస్‌ ధ్వంసం విషయంలో విచారణ ఎదుర్కొంటున్న ప్రణీత్ రావు కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి. టెలిగ్రాఫ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో మెమో జారీ చేశారు పోలీసులు. అధికారికంగా ట్యాపింగ్‌ కేసు నమోదు చేశారు.

నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్‌ యాక్ట్‌కింద కేసు నమోదైంది. ప్రతిపక్ష నేతల ఫోన్‌ కాల్స్‌ను ట్యాప్‌ చేస్తున్నారన్న ఆరోపణలతో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావును పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.

ఆ ఫోన్లను ఎందుకు ట్యాప్‌ చేయాల్సి వచ్చిందన్న విషయంతో పాటు ఆయనతో ఆ పని ఎవరు చేయించారన్న దానిపై ఇప్పటికే అనేక ప్రశ్నలు అడిగారు. ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌లలో ఏముందని, అధికారులు కూపీ లాగుతున్నారు. ఫోన్లను ట్యాప్‌ చేసి, ఆ సమాచారాన్ని ఎవరికి అందజేశారన్న విషయాలపై ప్రశ్నలు అడిగారు.

ఇప్పటికే జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల టీమ్‌ విచారించింది. ప్రణీత్‌రావు నుంచి పోలీసులు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను.. నా కొడుకు విప్లవ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు: కె.కేశవరావు

ట్రెండింగ్ వార్తలు