KCR
KCR : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ బృందం నోటీసులు ఇచ్చింది.
Also Read : Danam Nagender : బీఆర్ఎస్ చర్యలను బట్టి… దానం రియాక్షన్.. ఎంతవరకైతే అంతవరకు ఫైట్
నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు.. నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు విచారణకు హాజరుకావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చిన సిట్ అధికారులు. వయసు రీత్యా కేసీఆర్ పీఎస్‌కు రావాల్సిన అవసరం లేదని తెలిపారు. కేసీఆర్ కోరిన చోటే విచారిస్తామని చెప్పారు. అయితే, తొలుత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను సిట్ అధికారులు విచారిస్తారని భావించినప్పటికీ.. హైదరాబాద్ పరిధిలోనే కేసీఆర్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సిట్ చీఫ్ హోదాలో ఉన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ కేసీఆర్ ను విచారించే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందం ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు. అయితే,తాజాగా కేసీఆర్‌కు సిట్ బృందం నోటీసులు ఇచ్చింది. రెండుమూడు రోజుల్లో కవితకుసైతం సిట్ బృందం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమెను సిట్ కార్యాలయానికి పిలిపించి విచారణ జరుపుతారని తెలుస్తోంది.