Pm Modi Calls Bandisanjay
PM Modi Calls BandiSanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు.. అంటూ ప్రశంసించారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్ పై ప్రధాని మోదీ ఆరా తీశారు. పాదయాత్ర చేసిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారాయన. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పూర్తి చేసుకున్న బండి సంజయ్ కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఖమ్మం వెళ్తుండగా మార్గం మధ్యలో బండి సంజయ్ కు ప్రధాని నుంచి కాల్ వచ్చింది. కష్టపడి పని చేస్తున్నారంటూ బండి సంజయ్ ను ప్రధాని మోదీ అభినందించారు.
Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా
ప్రజా సంగ్రామ సేనతో పాటు పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు చెప్పాలని సంజయ్ తో మోదీ చెప్పారు. ‘‘మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టాను.. రెండు విడతల్లో కలిపి 770 కిలోమీటర్లు నడిచాను’’ అని మోదీకి చెప్పారు బండి సంజయ్. ‘‘నడిచింది నేనే అయినా.. నడిపించింది మీరే.. మీరు చెప్పిన ‘‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’’ పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నామని వివరించారు బండి సంజయ్.(PM Modi Calls BandiSanjay)
Bandi Sanjay
పాదయాత్రలో ప్రజలు ఏమంటున్నారు అని ప్రధాని అడగ్గా.. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్ ప్రధానికి తెలిపారు. కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నారని బండి ఆరోపించారు. పేదల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలను తన పాదయాత్రలో వివరిస్తుండటంతో కేసీఆర్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ వివరించారు.
Bandi Sanjay Padayatra
KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్
కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చానని ప్రధానికి తెలిపారు బండి సంజయ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాల రాకతో కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగిందని సంజయ్ చెప్పారు. రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ సూచనలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. మీ స్ఫూర్తితో కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కష్టపడి పని చేస్తున్నారని ప్రధానికి తెలిపారు బండి సంజయ్. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేయడం, కష్టపడి పని చేస్తున్నారని ప్రశంసించడం పట్ల బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని ఫోన్ కాల్ బీజేపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపిందన్నారు.
శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు.. @bandisanjay_bjp కు ప్రధానమంత్రి @narendramodi ఫోన్..
ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్ పై ఆరా..
పాదయాత్ర చేసిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన ప్రధాని..
మరిన్ని వివరాల కోసం ?https://t.co/rHBKpx1tXs pic.twitter.com/Me1eMog05h
— BJP Telangana (@BJP4Telangana) May 15, 2022