KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్ | Minister KTR Challenges Modi Government On Early Elections

KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్

మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గుజరాత్ లో ఏం చేశారు? హమ్ దో.... హమారా దో అన్న చందంగా కేటాయింపులు చేస్తున్నారు.(KTR On Early Elections)

KTR On Early Elections : ముందస్తు ఎన్నికలకు మేము రెడీ.. మీకా దమ్ముందా? కేంద్రానికి కేటీఆర్ సవాల్

KTR On Early Elections : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తుక్కుగూడ సభలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేతలు చేసిన తీవ్ర విమర్శలకు మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఆదివారం తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వహించిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన కేటీఆర్‌… అమిత్ షా చేసిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు.

Amit Shah : తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : అమిత్ షా

అమిత్ షా సహా బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. అమిత్ షా కాదు.. ఆయన అబద్దాల షా అని కేటీఆర్ అభివర్ణించారు. తుక్కుగూడలో బీజేపీ ఇచ్చింది తుక్కు డిక్లరేషన్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తుక్కుగూడలో బీజేపీ నేతలు చెప్పినవన్నీ తుప్పు మాటలే అన్నారు. అమిత్ షా మాటలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని అన్నారు.(KTR On Early Elections)

Ktr Fires On Amitshah

Ktr Fires On Amitshah

తెలంగాణలో రాజకీయ పర్యాటకుల సందడి మొదలైంది. ఇక్కడి వాస్తవ పరిస్థితులు వారికి తెలియవు. గాలి మాటలు చెప్పడం, వెళ్లిపోవడం వారికి ఆనవాయితీగా మారింది. అమిత్ షా తన పేరును అబద్ధాల బాద్ షా గా మార్చుకోవాలి. తుక్కుగూడలో అన్నీ తుక్కు మాటలే. వారి మాటలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పట్టించేలా చేశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మేము ముందుకు వచ్చాము.

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. రూ.2,500 కోట్లకు కర్నాటక సీఎం పదవి ఇస్తామని బీజేపీ హైకమాండ్ పై వచ్చిన ఆరోపణల సంగతేంటి? ఓ కాంట్రాక్టర్.. మంత్రి పేరు చెప్పి ఆత్మహత్య చరసుకోలేదా? ఓ మంత్రి.. కమిషన్ కోసం ప్రాజెక్టును అపలేదా? కర్ణాటకలో అవినీతి పై బహిరంగంగా చర్చ జరుగుతోంది. ఇక్కడ నోటికొచ్చింది షా మాట్లాడారు. ప్రజలు షో లు కోరుకోవడం లేదు.. రాజనీతి కోరుకుంటున్నారు. అప్పుల నిష్పత్తిలో రాష్ట్రానికి 23వ స్థానం. దేశాన్ని మోదీ దివాళా తీయిస్తున్నారు. మోదీ హయాంలో వందల లక్షల కోట్ల రూపాయలకు అప్పులు చేరాయి.(KTR On Early Elections)

Amit Shah (1)

Amit Shah (1)

పేదలను పీక్కు తిని.. పెద్దలకు రుణమాఫీ చేయడం లేదా? హమ్ దో…. హమారా దో అన్న చందంగా కేటాయింపులు చేస్తున్నారు. మీ ఆటలు ఇక సాగవు. బీజేపీ చరిత్ర లేని పార్టీ… పటేల్ ను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతలకు సోయి లేదు.

Minister talasani: ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం

మీ తాత్సరం వల్లే పాలమూరు పథకాన్ని పూర్తి చేయలేక పోతున్నాం. అసమర్ధ ప్రధాని కారణంగా దేశంలో ఈ పరిస్థితి నెలకొంది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గుజరాత్ లో ఏం చేశారు? గుజరాత్ లో బీజేపీ ఎమ్మెల్యేలు తప్పు బడుతున్నారు. గుజరాత్ మోడల్ అంతా ఫెయిల్యూర్. డబల్ ఇంజిన్ రాష్ట్రాల్లో బీజేపీ ఏం సాధించింది? సామాన్యులకు సచ్చేదిన్… మిత్రులకు అచ్చేదిన్. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అమిత్ షా మాట్లాడారు. గల్లా పట్టి ధాన్యం కొనుగోలు చేయించే సత్తా మాకుంది.(KTR On Early Elections)

Amit Shah

Amit Shah

అధికారం కోసం ప్లీజ్ అంటే వస్తుందా? అదేమైనా తంబాకా.. లవంగమా? పీఎం కిసాన్ కౌలు రైతులకు వస్తుందా? మా పథకాలు కాపీ కొట్టింది మీరు కదా? రాష్ట్రంలో ఉన్న సింగిల్ ఇంజన్ మిమ్మల్ని వదిలి పెట్టం. ఓవైసీ పేరెత్తకుండా మీరు మాట్లాడలేరా? తెలంగాణను శ్రీలంకతో పోల్చడం అవివేకం. ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధం.. కేంద్రానికి ఆ దమ్ము ఉందా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.

”ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన కర్మ మాకు లేదు. కేంద్రానికి అంత దమ్ము ఉంటే, అంత ఉబలాటం ఉంటే.. పార్లమెంటును రద్దు చేసుకోమనండి. వెంటనే ఎన్నికలకు రమ్మనండి. ఎన్నికలకు మేము కూడా రెడీ. పార్లమెంటును రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్తే.. వాళ్ల డబుల్ ఇంజిన్ ను వెంటనే వెళ్లగొట్టేందుకు, ఇంటికి పంపించేందుకు, తక్షణమే చెత్త బుట్టలో వేయడానికి దేశ ప్రజలు రెడీగా ఉన్నారు. వాళ్లకు అంత దమ్ముంటే, చేతనైతే పార్లమెంటును రద్దు చేసుకుని ఎన్నికలకు రమ్మనండి. తప్పకుండా మా సత్తా ఏంటో చూపిస్తాం. రాష్ట్రంలో టైమ్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, సీఎం కేసీఆర్ ఇదివరకే చెప్పారు. ఆ విధంగానే మేము ముందుకు పోతాం” అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

×