Best Smartphones : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ. 25వేల లోపు ధరలో 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ప్రీమియం ఫీచర్లతో రూ.25వేల లోపు ధరలో 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఎలా పొందాలో చూద్దాం..

Flipkart Big Billion Days Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి అదిరిపోయే న్యూస్.. అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం కానుంది. రూ. 25వేల లోపు ధరలో 5 అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఉన్నాయి. ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ ప్రియులు తమకు నచ్చిన ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆకర్షణీయమైన కెమెరాలు, అద్భుతమైన పర్ఫార్మెన్స్, అడ్వాన్స్ ఫీచర్‌లతో మీ బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయొచ్చు.

రియల్‌మి P3x : రియల్‌మి P3x ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ అందించే 6.72-అంగుళాల FHD+ విజన్ ప్యానెల్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6400 5G చిప్‌సెట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ 50MP + 2MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా కలిగి ఉంది. అసలు ధర రూ. 12,999 ఉండగా, అద్భుతమైన బ్యాంక్ ఆఫర్‌లతో సేల్ ధర రూ. 11,874కి తగ్గింపు పొందవచ్చు.

CMF నథింగ్ ఫోన్ 2 ప్రో : నథింగ్ CMF ఫోన్ 2 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 50MP+50MP+8MP ట్రిపుల్ మెయిన్ కెమెరా సిస్టమ్, 16MP సెల్ఫీ కెమెరా, 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. రూ. 18,999కి లిస్ట్ అయింది. కానీ సేల్ సమయంలో బ్యాంక్ డిస్కౌంట్‌లతో రూ. 17,099కి పొందవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో రన్ అయ్యే మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల P-OLED ప్యానెల్ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డ్యూయల్ 50MP+13MP రియర్ లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5500mAh బ్యాటరీతో వస్తుంది. రూ. 25,999తో ఈ ప్రొడక్టు బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 24,699కి కొనుగోలు చేయొచ్చు.

పోకో M7 ప్లస్ : పోకో M7 ప్లస్ ఫోన్ 6.9-అంగుళాల FHD+ స్క్రీన్ కలిగి ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మొబైల్ యూనిట్‌లో 50MP ఏఐ డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 7000mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ సేల్‌లో రూ. 14,499 విలువైన పోకో ఫోన్ రూ. 13,774కు ధరకు సొంతం చేసుకోవచ్చు.

వివో T4x : వివో T4x ఫోన్ 6.72-అంగుళాల IPS LCD డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 44W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 6500mAh బ్యాటరీ, డ్యూయల్ 50MP+2MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ షూటర్ కలిగి ఉంటుంది. రూ. 14,999 విలువైన వివో ఫోన్ బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 13,774కు పొందవచ్చు.