PM Modi Telangana Tour : రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

PM Modi Telangana Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

PM Modi Telangana Tour

PM Modi Telangana Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గోనున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు మోదీ బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హెచ్ఐసీసీకి బయల్దేరి.. అక్కడే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం హైటెక్ సిటీలో ఓ ఆస్పత్రికి ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 6.30గంటల నుంచి 7.30 గంటల వరకు హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Also Read : PM Modi Telangana Tour : హైదరాబాద్‌‌కు‌ ప్రధాని నరేంద్ర మోదీ.. శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివే..

పరేడ్ గ్రౌండ్స్ సభకు భారీగా బీజేపీ శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో, వీవీఐపీ కాన్వాయ్‌ల రాకపోకల దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్లు చేపట్టారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు ముందుగానే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచన చేశారు.

ప్రత్యామ్నాయ మార్గాలివే.. 
♦ బేగంపేట్ నుంచి సంగీత్ వెళ్లేవారు పారడైజ్- ప్యాట్ని-క్లాక్ టవర్ మార్గంలో వెళ్లాలి.
♦ బేగంపేట్ నుంచి తిరుమలగిరి వెళ్లేవారు ఫ్లైఓవర్లు-సెయింట్ జాన్స్ రోటరీ-AOC మార్గం గుండా వెళ్లాలి.
♦ బాలానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలకు అమీర్‌పేట్-పంజాగుట్ట మార్గంలో డైవర్షన్ చేశారు.
♦ రసూల్‌పురా జంక్షన్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
♦ సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లి వెళ్లేవారు క్లాక్‌టవర్-ప్యాట్నీ-పారడైజ్ మార్గంగుండా వెళ్లాలి.
♦ ట్యాంక్‌బండ్ నుంచి తిరుమలగిరి వెళ్లేవారికి టాడ్‌బండ్- డైమండ్ పాయింట్ మార్గంలో డైవర్షన్ చేశారు.
♦ ఆయా మార్గాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఆంక్షలువిధించారు.
♦ మెట్రో రైలు, ప్రజా రవాణా సేవలు వినియోగించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
♦ రోడ్లపై అనధికార పార్కింగ్ చేస్తే వాహనాల సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
♦ అత్యవసర వాహనాలకు పరిస్థితులను బట్టి అనుమతి ఉంటుందని, ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
♦ వీవీఐపీ రాకపోకలు పూర్తయ్యాక ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేయడం జరుగుతుందని తెలిపారు.
♦  మోదీ బహిరంగ సభ కోసం 12 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పార్కింగ్ ప్రదేశాలకు చేరుకునేందుకు క్యూఆర్ కోడ్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.