PM Modi Telangana Tour : హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ.. శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివే..
PM Modi Telangana Tour : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. గచ్చిబౌలిలోని హెచ్ఐసీ సెంటర్లో ఈ అధికారిక కార్యక్రమం జరగనుంది.
PM Modi Telangana Tour
PM Modi Telangana Tour : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు మోదీ బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హెచ్ఐసీసీకి బయల్దేరి.. అక్కడే ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం హైటెక్ సిటీలో ఓ ఆస్పత్రికి ప్రారంభోత్సవం చేయనున్నారు. సాయంత్రం 6.30గంటల నుంచి 7.30 గంటల వరకు హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు.
Also Read : Makhanlal Sarkar : సువేందు ప్రమాణస్వీకారంలో అందరి ముందు ఈ పెద్దాయన కాళ్లు మొక్కిన పీఎం మోదీ.. ఎవరీయన?
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీ సెంటర్లో ఈ అధికారిక కార్యక్రమం జరగనుంది.
ప్రధాని మోదీ ప్రారంభించే, శంకుస్థాపన చేసే ప్రాజెక్టుల వివరాలు:
♦ రూ. 3,180 కోట్ల వ్యయంతో.. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ (NH-167)లో భాగంగా గుడెబల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు నిర్మించనున్న 4-లేన్ల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
♦ రూ.2,360కోట్లతో పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేస్తూ జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
♦ రూ. 1,250 కోట్లతో నిర్మించిన కాజీపేట – విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన వివిధ విభాగాల పనులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
♦ కాజీపేటలో రూ.300 కోట్లతో నిర్మించిన రైల్ అండర్ రైల్ బైపాస్ లైన్‌ను ప్రారంభిస్తారు.
♦ రూ.1,700 కోట్లతో వరంగల్‌లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన పీఎం మిత్ర పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్) ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేస్తారు.
♦ రూ.610 కోట్లతో హైదరాబాద్ మల్కాపూర్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ పీవోఎల్ టెర్మినల్ ను కూడా మోదీ ప్రారంభించనున్నారు.
