Mainampalli Hanmantarao : టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై కేసు నమోదు

మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావుపై కేసు నమోదైంది. బీజేపీ కార్పొరేటర్ పై దాడి చేశారన్న అభియోగంతో కేసు నమోదు చేశారు.

Mainampalli

Case against TRS MLA Mainampalli : మల్కాజ్ గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావుపై కేసు నమోదైంది. బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడి చేశారన్న అభియోగంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 307, 323, 324, 143, 147, 149 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. మైనంపల్లి సహా మరో 15 మంది కార్యకర్తలపై కేసు నమోదు అయింది.

బండి సంజయ్ పై మైనంపల్లి హన్మంతరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై తప్పుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తలుచుకుంటే బండి సంజయ్ ను ఎక్కడైనా ఘెరావ్ చేస్తానని అన్నారు. రేపటి నుంచి తెలంగాణలో ఎలా తిరుగుతారో చూస్తానని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ బండి సంజయ్ ను కలవలేదని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సిన్సియర్ గా టీడీపీకి లాయర్ గా పని చేశానని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అంతా ఒకే వేదికపై ఉంటే మెదక్ జిల్లాలో తాను ఒక్కన్నే ఒకవైపు ఉన్నట్లు గుర్తు చేశారు. బండి సంజయ్ కు చేతకాక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనను తిట్టినట్లు పేర్కొన్నారు. రాత్రంతా ఇక్కడే ఉంటానని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు.