Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ CISF అధికారి హల్‌చల్.. మహిళలను టార్గెట్‌గా చేసుకొని.. ఏకంగా 65మందిని..
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్ చల్ చేశాడు. CISF యూనిఫామ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో సంచరిస్తుండగా అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.
- Harishth Thanniru
- Updated on- April 14, 2026 / 04:40 PM IST
Fake Cisf Officers At Shamshabad Airport
- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ CISF అధికారి హల్‌చల్
- CISF యూనిఫామ్‌లో సంచరిస్తూ పట్టుబడ్డ బాలకృష్ణ
- పెళ్లి పేరుతో 67మంది మహిళలను మోసం చేసినట్లు ఆరోపణలు
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్ చేశాడు. CISF యూనిఫామ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో సంచరిస్తుండగా ఔట్ పోస్టు పోలీసులు గుర్తించి నిందితుడిని ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
నకిలీ సీఐఎస్ఎఫ్ పేరు బాలకృష్ణ. తాను సీఐఎస్ఎఫ్ అధికారినని చెప్పి పలువురిని మోసం చేశాడు. మ్యాట్రిమొనీ వెబ్ సైట్ల ద్వారా మహిళలను బాలకృష్ణ లక్ష్యంగా చేసుకునేవాడు. సీఐఎస్‌ఎఫ్ అధికారిగా నటిస్తూ యువతులకు వల వేశాడు. ఈ క్రమంలో పెళ్లి పేరుతో ఇప్పటి వరకు 67 మంది మహిళలను మోసం చేసినట్లు బాలకృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. నకిలీ గుర్తింపులతో పలుచోట్ల బాలకృష్ణ మోసాలకు పాల్పడిన ట్లు పోలీసులు గుర్తించారు. అతనిది శ్రీకాకుళం జిల్లా. నిందితుడిపై మరిన్ని కేసులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
లగేజీలో పేలిన సెల్ ఫోన్ ..
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రమాదం జరిగింది. లగేజీ తనిఖీ సమయంలో సెల్ ఫోన్ పేలడంతో కలకలం రేగింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పలువురు పరుగులు తీశారు. అధికారులుసైతం కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎయిర్ పోర్టులో రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా సీఐఎస్ఎఫ్ అధికారులు లగేజీ చెక్ చేస్తుండగా సెల్‌ఫోన్ పేలింది. ఈ ఘటనకు సంబంధించి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి విచారణ తరువాత ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే.. వేసవి కాలం కారణంగా ఫోన్లలో ఓవర్ హీట్ వల్ల సెల్ ఫోన్లు పేలుతున్నట్లు చెబుతున్నారు.
