SSC Phase 14 Apply Online : టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తయిన వారికి శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 3వేల ఉద్యోగాలు.. భారీగా జీతం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
ssc phase 14 apply online : 2026 సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-14నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో మొత్తం 3003 ఖాళీలను భర్తీ చేయనుంది.
ssc phase 14 apply online
- ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్-14నోటిఫికేషన్ రిలీజ్
- 3003 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్
- ఈనెల 13 నుంచి మే4 వరకు దరఖాస్తులు స్వీకరణ
ssc phase 14 apply online : టెన్త్, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి భారీ శుభవార్త. 2026 సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సీ (Staff Selection Commission) సెలక్షన్ పోస్టు ఫేస్-14 నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో మొత్తం 3003 ఖాళీలను భర్తీ చేయనుంది.
పదవ తరగతి, ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే4వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే చివరి తేదీ నాటికి అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష జూన్లో నిర్వహించనున్నారు.
మొత్తం 3003 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. ఇందులో లాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, అకౌంటెంట్, జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, మార్కెటింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, డ్రైవర్, స్టోర్ కీపర్, టెక్నీషియన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నర్సింగ్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, క్లర్క్ ఫార్మసిస్ట్, కోర్ట్ మాస్టర్ వంటి వివిధ పోస్టులు ఉన్నాయి.
పోస్టులను బట్టి 01.01.2026 నాటికి 18 నుంచి 37ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన స్కిల్ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఉద్యోగానికి అర్హత పొందిన వారికి పోస్టులను బట్టి నెలకు వేతనం రూ.18వేల నుంచి రూ.1,50,000 వరకు ఉంటుంది.
పరీక్ష 60 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో జరనల్ ఇంటలిజెన్స్ 25, జనరల్ అవేర్నెస్ 25, క్వాటిటేటివ్ ఆప్టిట్యూట్ -25, ఇంగ్లిష్ లాంగ్వేజ్ -25 చొప్పున 100 ప్రశ్నలకు మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కు కోత విధిస్తారు.
ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే వీలుంది. ఈ క్రమంలో ప్రతి దరఖాస్తుకు విడివిడిగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులు ఎలాంటి ఫీజు ఉండదు.
ముఖ్యతేదీలు ఇవే..
♦ ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం : 13.04.2026
♦ దరఖాస్తు చివరి తేదీ : 04.05.2026
♦ ఫీజు చెల్లింపు చివరి తేదీ : 05.05.2026
♦ దరఖాస్తు తప్పుల సవరణకు అవకాశం : 11.05.2026 నుండి 13.05.2026.
♦ పరీక్ష తేదీ : జూన్ 2026 (తాత్కాలిక)
