Telangana Govt : తెలంగాణలోని రైతులకు భారీ ఊరట.. ఇక ఆ సమస్యలకు చెక్! వెంటనే మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి..
Telangana Govt : గతంలో సాదాబైనామాల క్రబద్దీకరణ అధికారాలు తహసీల్దార్లు పూర్తి చేసేవారు. కానీ, ఇప్పుడు తహసీల్దార్లు విచారణ నివేదిక పంపిస్తే వాటిని ఆర్దీవోలు పరిశీలించి భూ భారతి పోర్టల్లో భూమికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి హక్కులు కల్పించనున్నారు.
Telangana Government Sadabainama Applications Settlement Begins
- తెలంగాణ రైతులకు భారీ ఊరట
- సాదాబైనామాల పరిష్కారం ప్రారంభం
- రైతులు వెంటనే దరఖాస్తు స్థితి చెక్ చేసుకోండి
Telangana Govt : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణ్ణయం తీసుకుంది. రైతులకు భారీ ఊరట కల్పించింది. సాదాబైనామాల క్రమబద్దీకరణకు భూ క్రయ, విక్రయదారుల అఫిడవిట్ల నిబంధన చిక్కులు తొలగాయి. ఆర్డీవోలే విచారణాధికారులుగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నిబంధనల పేరిట ముందుకు సాగని సాదాబైనామాల క్రమబద్దీకరణ ఇకపై ఫాస్ట్ట్రాక్లో జరగనుంది. ఇప్పటికే సాదాబైనామాల పరిష్కారాలు ప్రారంభమయ్యాయి.
Also Read: వార్నీ.. ఊహించని దెబ్బకొట్టిన బంగారం.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
సాదాబైనామా కోసం 2020 అక్టోబర్- నవంబరులో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 9లక్షల మంది రైతులు ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నింటినీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆఫీస్ ఆన్లైన్ ద్వారా జిల్లా కలెక్టరేట్లకు ట్రాన్స్ఫర్ చేసింది. అయితే, 2023లో కొన్ని దరఖాస్తులను పలు జిల్లాల్లో కలెక్టర్లు తిరస్కరించారు. అంతేకాదు.. భూముల క్రయవిక్రయదారులు ఇద్దరూ అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వం 2025లో ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. దీంతో తొమ్మిది లక్షల దరఖాస్తుల్లో కేవలం 7వేలు మాత్రమే పరిశీలన పూర్తయ్యాయి. అయితే, ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఈ నిబంధనలను సవరించడంతో సాదాబైనామాల పరిష్కారానికి లైన్ క్లియర్ అయింది.
ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ప్రకారం.. సాదాబైనామాల క్రమబద్దీకరణ అధికారాలు ఆర్డీవోలకు కల్పించారు. గతంలో సాదాబైనామాల క్రబద్దీకరణ అధికారాలు తహసీల్దార్లు పూర్తి చేసేవారు. కానీ, ఇప్పుడు తహసీల్దార్లు విచారణ నివేదిక పంపిస్తే వాటిని ఆర్దీవోలు పరిశీలించి భూ భారతి పోర్టల్లో భూమికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి హక్కులు కల్పించనున్నారు. ప్రస్తుతం క్షేత్ర స్థాయి విచారణలో తేలే అంశాలే కీలకంగా మారుతున్నాయి.
క్రమబద్దీకరించాల్సిన భూముల సరిహద్దు రైతులకు తహసీల్దార్లు నోటీసులు జారీ చేస్తున్నారు. సాదాబైనామా రైతు సమర్పించే అఫిడవిట్ పూర్తి ఆధారాలతో ఉండటంతోపాటు 30రోజుల పాటు అభ్యంతరాలేవీ రాకుంటే క్రమబద్దీకరణ సులువుగా పూర్తవుతుందని రెవెన్యూ వర్గాలు సూచిస్తున్నాయి. రైతులు వెంటనే తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి.
