Gay Dating Apps Nlg : ఆ జిల్లాలో గే డేటింగ్ యాప్‌‌ల కలకలం… ఇప్పటికే 30 వేల మంది.. లాయర్లు, వైద్యులు, టెకీలు.. ఇదేం పోయే కాలంరా నాయనా..!

Gay Dating Apps Nalgonda : ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితం అయిన గే డేటింగ్ యాపులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ జిల్లాలో సుమారు 30 వేల మంది గే డేటింగ్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

police said in nalgonda district more than 30000 members registration in different gay dating apps

  • నల్లగొండ జిల్లాలో పెరుగుతున్న గే డేటింగ్ యాప్ లు
  • ఇప్పటికే 30 వేల మంది రిజిస్ట్రేషన్లు
  • లాయర్లు, టెకీలు, వైద్యులు వీటిల్లో భాగం

Gay Dating Apps Nalgonda : గే డేటింగ్ యాప్, లెస్బియన్ ఇలాంటి పదాలు ఇప్పటి వరకు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం అనుకున్నాం. కానీ క్రమంగా ఇవి ఇప్పుడు జిల్లాలకు కూడా వ్యాపిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో గే డేటింగ్ యాప్‌‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 30 వేల మంది వీటిల్లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిసింది. జిల్లాల్లో కూడా గే డేటింగ్ యాప్ ల వినియోగం పెరగడం కలకలం రేపుతోంది. మరి ఈ గే డేటింగ్ యాప్ ల గురించి ఎలా బయటకు వచ్చింది అంటే..

వారం రోజుల క్రితం నల్లగొండ జిల్లా, కోదాడలో జరిగిన హత్య కేసు దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులోని నిందితుడు, బాధితుడు.. ఇద్దరూ గే డేటింగ్ యాప్ ద్వారానే పరిచయం అయినట్లు దర్యాప్తులో తేలింది. ఇదిలా ఉంటే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గే డేటింగ్ యాప్‌‌ల వినియోగం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగినట్లు పోలీసు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు ఇంటర్నెట్ లభిస్తుండటం.. స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరగడంతో.. యువత డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుంటోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరూ యువకులే.. డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఓ రూమ్ బుక్ చేసుకున్నారు.. ఆ తరువాత ట్విస్టుల మీద ట్విస్టులు.. పోలీసుల ఎంట్రీతో..*

ఒక ప్రముఖ గే డేటింగ్ యాప్‌‌లోనే జిల్లాలోని సుమారు 30 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ డేటింగ్ యాప్‌‌లను వాడుతున్న వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు యువతేనని తేలడం గమనార్హం. ఈ డేటింగ్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు వంటి ఉన్నత ఉద్యోగవంతులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇప్పటి వరకు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ గే డేటింగ్ యాప్‌‌లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయని.. సూర్యాపేట, కోదాడ, గరిడేపల్లి, హుజూర్‌నగర్ వంటి రూరల్ ప్రాంతాల్లో కూడా వీటి వినియోగం పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.

*డేటింగ్ యాప్ బాగా వాడేస్తున్న వృద్ధులు .. మాకూ ప్రేమ కావాలంటున్న బామ్మలు, తాతయ్యలు

కేటుగాళ్లు ఈ యాప్‌‌ల ద్వారా పరిచయాలు పెంచుకొని అమాయకులపై వల విసిరి ఆపై వారితో చేసిన చాటింగ్, ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌‌కు పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కేటుగాళ్లు.. ఈ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని గుర్తించి వారితో పరిచయాలు పెంచుకుని ఆపై ఏకాంత ప్రాంతాలు, లాడ్జీలకు పిలిచి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

తాజాగా కోదాడ హత్య కేసులో కూడా ఈ బ్లాక్‌మెయిల్ వివాదమే చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు యాప్‌‌లపై నిఘా పెట్టి చాటింగ్ హిస్టరీ, కాల్ డేటా పరిశీలిస్తున్నారు. యువత మోసాలకు గురికాకుండా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని సూర్యాపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.