Hyderabad : ఇద్దరూ యువకులే.. డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఓ రూమ్ బుక్ చేసుకున్నారు.. ఆ తరువాత ట్విస్టుల మీద ట్విస్టులు.. పోలీసుల ఎంట్రీతో..
Hyderabad : ఇద్దరు యువకులకు డేటింగ్ యాప్‌లో పరిచయం అయింది. అందులో ఒకరు డాక్టర్. ఓసారి కలుద్దామని అనుకున్నారు.

Hyderabad Dating app
Hyderabad Dating App : ఇద్దరు యువకులకు డేటింగ్ యాప్‌లో పరిచయం అయింది. అందులో ఒకరు డాక్టర్. ఓసారి కలుద్దామని అనుకున్నారు. ఇందుకోసం ఓయోలో రూమ్ బుక్ చేశారు. వాళ్లిద్దరూ రూమ్‌లో కలుసుకున్నారు. కానీ, ఆ తరువాతే అసలు కథ మొదలైంది.. వారిద్దరి వ్యవహారం పోలీసుల వద్దకు చేరింది.. పోలీసులు రంగంలోకిదిగి అందులో ఒకరిని అరెస్టు చేశారు.
Also Read: Nagarjuna: నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ కోర్టులో నాగార్జున పిటీషన్
విజయవాడ సాలిపేట గ్రామానికి చెందిన 23ఏళ్ల వ్యక్తి మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతనికి గ్రిండర్ యాప్‌లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులపాటు వారిద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఒకరోజు యువకుడు మనిద్దరం కలుద్దామని ప్రతిపాదన చేశాడు. దీనికి వైద్యుడు ఒప్పుకున్నాడు. దీంతో యువకుడు ఈనెల 21న ఓయోలో రూమ్ బుక్ చేశాడు. రూమ్ లొకేషన్ ను వైద్యుడికి పంపించాడు. ఇద్దరూ రూమ్‌లోకి వెళ్లారు.
రూమ్ లో ఇద్దరు యువకులు కలుసుకొని కొద్దిసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో యువకుడు సిక్సువల్ గా కలుద్దామని వైద్యుడిపై ఒత్తిడి చేశాడు. అందుకు వైద్యుడు ఒప్పుకోకపోవడంతో అతనిపై చేయిచేసుకున్నాడు. సెక్సువల్ గా కలవకపోతే నువ్వు గే అని మీ తండ్రికి ఫోన్ చేసి చెబుతా అంటూ బెదిరించాడు. అలా జరగకుండా ఉండాలంటే కొంత డబ్బు కావాలని వైద్యుడిని డిమాండ్ చేశాడు. దీంతో తన జేబులో ఉన్న రూ.5వేలను ఇచ్చేశాడు.
మరుసటి రోజు వైద్యుడు పనిచేస్తున్న ఆస్పత్రికి వెళ్లి నానా హంగామా చేశాడు. మళ్లీ వైద్యుడు ఉండే ప్లాట్ వద్దకుసైతం వెళ్లాడు. తనకు డబ్బులు కావాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో వైద్యుడు తన వద్ద ఉన్న రూ.3వేలను ఆ యువకుడికి ఇచ్చి పంపించేశాడు.
తనకు మరిన్ని డబ్బులు కావాలి.. లేదంటే నువ్వు గే అని అందరికీ చెప్పేస్తా అంటూ యువకుడు వేధింపులకు గురిచేశాడు. దీంతో వైద్యుడు ఈనెల 22న సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో ఫిర్యాదు చేయగా.. వారు కేసును మాదాపూర్ పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి గురువారం అరెస్టు చేశారు.