Nagarjuna: నా ఫోటోలు వాడితే కఠిన చర్యలు.. ఢిల్లీ కోర్టులో నాగార్జున పిటీషన్
టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. (Nagarjuna)అనుమతి లేకుండా తన పేరును, ఫొటోలను వాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ సమర్పించారు నాగార్జున.

Hero Nagarjuna files petition in Delhi High Court over right to personality
Nagarjuna: టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన పేరును, ఫొటోలను వాడకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ సమర్పించారు నాగార్జున. ఈ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారించారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన కంటెంట్‌లో, వస్తువులు, దుస్తులపై తన ఫోటోలను అనధికారికంగా ఉపయోగించడం అనేది వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని నాగర్జున(Nagarjuna) తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తాము అక్కినేని నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడతామని సూచిందింది. దీంతో, సోషల్ మీడియాలో కానీ, వేరే ఏ ఇతర కంటెంట్ లో గానే నాగార్జున అనుమతి లేకుండా ఆయన ఫోటోలను వినియోగిస్తే చట్ట పరమైన చర్యలకు దారి తీసే అవకాశం ఉండనుంది. ఇక ఇటీవల బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ కూడా ఇదే విషయంలో కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా ఆమెకు సానుకూల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే, ఇటీవల అయన కుబేర, కూలీ వంటి సినిమాల్లో కీ రోల్ ప్లే చేశారు. ప్రస్తుతం ఆయన హీరోగా తన 100 సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను కొత్త కార్తీక్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. నాగార్జున కెరీర్ లో 100వ సినిమాగా వస్తున్న ఈ స్పెషల్ మూవీ ఆయనకు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి.