Sandeep Reddy Vanga: చిన్న హీరోతో సందీప్ రెడ్డి వంగ సినిమా.. వైలెంట్ డైరెక్టర్ సెన్సేషనల్ డెసిషన్.. త్వరలోనే..!
సందీప్ రెడ్డి వంగ.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. లెక్కేసి చెప్పాలంటే(Sandeep Reddy Vanga) తీసింది మూడు సినిమాలు మాత్రమే. అందులో ఒక హిందీలో రీమేక్. అంటే రెండు సినిమాలు చేసి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

Sandeep Reddy Vanga to make films as a producer
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. లెక్కేసి చెప్పాలంటే తీసింది మూడు సినిమాలు మాత్రమే. అందులో ఒక హిందీలో రీమేక్. అంటే రెండు సినిమాలు చేసి ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ కూడా సందీప్ రెడ్డి వంగ సినిమాలకి, ఆయన టేకింగ్ కి ఫ్యాన్ అయిపోయాడు అంటే మాములు విషయం కాదు. అంతలా, తన మార్క్ క్రియేట్ చేశాడు ఈ దర్శకుడు(Sandeep Reddy Vanga). ప్రస్తుతం సందీప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలను మించేలా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు సందీప్. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ కావడానికి చాలా టైం పట్టేలా ఉంది. అందుకే, తన మార్క్ ఆడియన్స్ పై అలానే ఉండేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. తన దర్శకత్వంలోనే కాదు నిర్మాణంలో కూడా సినిమాలు చేయాలనీ భావిస్తున్నాడట. కొత్త వాళ్లకి అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నాడట.
ఇందుకోసం సందీప్ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్ పై కొత్త నటీనటులు, దర్శకులతో సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇందులో భాగంగా మొదటి సినిమాకి ముహూర్తం కూడా ఖారారు చేశాడు. తన మొదటి సినిమాకు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణుని దర్శకుడిగా ఎంచుకున్నాడట. తెలంగాణ బ్యాక్డ్రాప్ లో యూత్ ఫుల్ కంటెంట్ తో రానున్న ఈ సినిమాలో “మేం ఫేమస్” ఫేమ్ “సుమంత్ ప్రభాస్” హీరోగా నటించనున్నాడట. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని ఇండస్ట్రీ నుంచి వస్తున్న టాక్. మరి ఇంతకాలం దర్శకుడిగా బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడో చూడాలి.