Ponnam Prabhakar : ఏపీ సీఎం చంద్రబాబుకి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ.. మీ మిత్రపక్షాల్ని కంట్రోల్ చేయండి అంటూ
Ponnam Prabhakar : పొన్నం ప్రభాకర్.. ఏపీ సీఎం చంద్రబాబుకి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
- Dharani Pilli
- Updated on- April 21, 2026 / 02:43 PM IST
Ponnam Prabhakar Open Letter To ap cm Chandrababu Naidu over mp tejasvi comments
- ఏపీ సీఎం చంద్రబాబుకి పొన్న బహిరంగ లేఖ
- రాష్ట్ర విభజనపై జనసేన, బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం
- వారిని కంట్రోల్ చేయాలంటూ సూచన
Ponnam Prabhakar : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బర్త్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. గత కొన్ని రోజులుగా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవిభజనపై గురించి ఏపీ కూటమి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, వాటి పరిణామాలను వివరిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. ఇప్పుడీ లేఖ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర విభజనపై టీడీపీ మిత్రపక్షాల నేతలు చేస్తున్న వరుస వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పొన్నం…. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తున్న ఆ వ్యాఖ్యల్ని సహించబోమని హెచ్చరించారు.ప
‘‘బీజేపీ ఎంసీ తేజస్వీ సూర్య సాక్షత్తు పార్లమెంట్ సాక్షిగా.. ఆంధ్రా- తెలంగాణ విభజనను భారత్ – పాకిస్థాన్ విభజనతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మేలా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్‌కు లేఖ రాయండి’’ అని పొన్నం చంద్రబాబును డిమాండ్ చేశారు.
‘‘రాష్ట్ర విభజనసై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, త్యాగాలు గొప్పవి. రాజ్యాంగబద్ధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నారు’’ అని తెలిపారు.
‘‘కాని కొందరు ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు. కానీ, బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలు వైషమ్యాలకు దారి తీస్తున్నాయి. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి. అలాగే.. ప్రధాని మోదీ గతంలో చేసిన ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అనే వ్యాఖ్యలు అనుచితం’’ అన్నారు.
‘‘తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల మధ్య వైషమ్యాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు. అలాంటి మాటలు మానుకోవాలి. మీ మిత్రపక్షాల పార్టీల నేతల్ని నియంత్రించండి. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. వివాదాస్పద వ్యాఖ్యలకు ముగింపు పలకాలి. తెలంగాణ వారంతా ఐక్యంగా ముందుకు సాగాలి’’ అని పొన్నం ఆ లేఖలో పేర్కొన్నారు.
‘‘మీ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన అధినేతలతో పాటు అక్కడక్కడ మీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవు. రాష్ట్ర విభజన ఏదో అనుచితంగా జరిగినట్టు, అసమంజసంగా తెలంగాణ ఏర్పడ్డట్టు చేస్తున్న అసందర్భపు వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన స్పర్థలు, వైషమ్యాలు, ద్వేషాలు రగిలించేవిగా ఉంటున్నాయి. ఇతరులకు లేని అపోహలు కలిగిస్తున్నాయి. మనసు కలత చెందుతోంది. ఇది ఎవరికీ మంచిది కాదు. కనుక మీ పార్టీ, మిత్రపక్ష పార్టీల నేతలకు మీరే చెప్పండి.. వారిని కట్టడి చేస్తే మంచిది’’ అంటూ లేఖను ముగించారు.
