దేవుని సేవను ఆపడానికి కుట్ర చేసినోడు ఎవ్వడు మిగలడు : కేఏ పాల్

నేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెద్దామని చెప్పాను. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్లు నాతో మాట్లాడొద్దు అని చెబుతున్నారు.

KA Paul

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శనివారం సంగారెడ్డి కలెక్టర్ ని కలిశారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదాశివపేటలో 1200 ఎకరాల్లో సొంతంగా చారిటీ పెట్టి 53వేల మందికి ఉచితంగా అన్నం పెట్టాను. నా చారిటీని కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో రద్దు చేయించారు. ఇప్పుడు చారిటీలో 50ఎకరాల భూములను గుంజుకోవడానికి నా మనుషులపై దాడులు చేసి బెదిరిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డితోపాటు ఏడుగురిని పైకి పంపినట్టే నా భూమిని కబ్జా చేస్తున్న వారిని పైకి పంపుతా.. దేవుని సేవను ఆపడానికి కుట్ర చేసినోడు ఎవ్వడూ కూడా మిగలడు అంటూ కేఏ పాల్ హెచ్చరించారు.

Also Read : ఎక్కడైనా చర్చకు సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు లో కేసు వేస్తానని కేఏ పాల్ అన్నారు. రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. నేను సీఎం రేవంత్ రెడ్డి కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెద్దామని చెప్పాను. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నవాళ్లు నాతో మాట్లాడొద్దు అని చెబుతున్నారు. రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బెస్ట్ సీఎం అవుతారు.. లేకపోతే వరెస్ట్ సీఎం అవుతారని పాల్ అన్నారు. అక్టోబర్ 2న సమ్మిట్ పెట్టాలి. లేకపోతే ఏదో ఓ బటన్ నొక్కి అందరి సంగతి తేలుస్తా అంటూ పాల్ వ్యాఖ్యానించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు