టీఎంటీఏయూ అధ్యక్షుడిగా పృథ్వీరాజ్
- Subhan Ali Shaik
- Published On : August 27, 2019 / 04:09 AM IST
తెలంగాణ మూవీ, టీవీ ఆర్టిస్ట్ యూనియన్(టీఎంటీఏయూ) అధ్యక్షుడిగా బాలిరెడ్డి పృథ్వీరాజ్ ఘన విజయం సాధించారు. ఫిలిం ఛాంబర్లో జరిగిన ఎన్నికల్లో పృథ్వీ రాజ్ తనపై పోటీ చేసిన నాగేంద్ర శర్మపై 310ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 360ఓట్లు పోల్ కాగా పృథ్వీ రాజ్‌కు 310ఓట్లు వచ్చాయి.
ఉపాధ్యక్షులుగా ఆశ, లక్ష్మీ కాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సైదులు, కోశాధికారిగా ఉంగరాల వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గోంగూర శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీలుగా ఎ.రాజశేఖర్, పద్మా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా జబర్దస్త్ అప్పారావు, నాగభూషణం, నూకరాజు, ఇ.నవీన్, సిహెచ్.రవీంద్ర, రామచంద్రయ్య, శ్రీనివాస్ రాథోడ్, సుందరయ్య, లక్ష్మి ప్రసన్న, నాగమణి, రజనీ శ్రీకళ, సౌదామిని, తేజస్వి ఎన్నికయ్యారు.
