Bus Accident: నల్లగొండ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా: 20 మంది ప్రయాణికులకు గాయాలు

నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రములో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Accide

Bus Accident: రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున రెంటచింతల వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మినీ వ్యానులో ప్రయాణిస్తున్న 9 మంది మృతి చెందగా..మరో 29 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే..నల్లగొండ జిల్లాలో మంగళవారం (సోమవారం అర్ధరాత్రి దాటాక) రోడ్డు ప్రమాదం సంభవించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రములో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

other stories: TV Actress : టీవీ నటి ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కి తరలించిన పోలీసులు..

ప్రమాదాన్ని గమనించిన పోలీసులు, స్థానికుల సహాయంతో గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నా.. బ్రేక్ ఫెయిల్ బస్సు ఓవర్ టర్న్ అయిందని డ్రైవర్ తెలిపాడు.

other stories: Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు