Congress
గుర్తింపు, గౌరవం ఈ రెండింటి కోసమే.. ప్రతి మనిషి ఆరాటం. ఈ రెండింటి కోసమే ప్రతి వ్యక్తి పోరాటం. రాజకీయనేతలయితే వీటి కోసం పడే తాపన మామూలుగా ఉండదు. గుర్తింపు కరువైనా.. గౌరవం దూరమైనా అస్సలు భరించరు. ప్రోటోకాల్ పాటించుకున్నా.. పిలుపు రాకున్నా.. ఆ నేతలకు కోపం కట్టలుతెచ్చుకొని వస్తుంది. ఇప్పుడు అచ్చం అలానే ఫీల్ అవుతున్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఏకంగా సీఎం సభలోనే తన అసహనాన్ని వెల్లగక్కారు. ఇంతకీ వంశీకృష్ణకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాధాన్యం ఇవ్వడం లేదా? అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపించడం లేదా.. ? ఎంపీ అసంతృప్తికి కారణమేంటి?
పెద్దపల్లిలో ప్రోటోకాల్ మంటలు చెలరేగాయి. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విప్పిన అసంతృప్తి గళం పెద్దకు చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ పాటించినా.. పాటించకపోయినా.. అభివృద్ధి కార్యక్రమాలకు పిలిచినా.. పిలవకపోయినా తాను వస్తానంటూ ఆయన సీఎం రేవంత్ సభలోనే గర్జించారు.ఎంపీగా గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యేలు తనను పెద్దగా పట్టించకోవడం లేదనే ఇన్నర్ ఫీలింగ్ వంశీకృష్ణ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో ఆయన చేసిన వాఖ్యలపై పొలిటికల్ సర్కిళ్లలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వంశీ ప్రాతినిద్యం వహిస్తున్న పెద్దపల్లి పార్టమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఏడు నియెజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో వంశీ తండ్రి వివేక్, ఆయన పెద్దనాయన వినోద్ చెన్నూర్, బెల్లంపల్లి నియెజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిద్యం వహిస్తున్నారు. పైగా వంశీ తాత గడ్డం వెంకట స్వామి ఒకప్పుడు ఇదే పార్టమెంట్ పరిధిలో రాజకీయాల్ని శాసించారు. అలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వంశీ.. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది.
ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదట
జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గడ్డం వెంకటస్వామి రెండో తరం రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వంశీ.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అయితే చెన్నూర్, బెల్లంపల్లి నియెజకవర్గాలు మినహా మిగితా ఐదు అసెంబ్లీ నియెజకవర్గాల్లో ఆయనకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదట. కనీసం పార్టీ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదట. పైగా శిలాఫలకాల్లోనూ తన పేరును చేర్చడం లేదట. దీంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏదో ఒకటో రెండో కార్యక్రమాలకు మొక్కుబడిగా పిలుస్తున్నారని ఫీల్ అవుతున్నారట.
అయితే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో వంశీ కృష్ణ కుటుంబ జోక్యాన్ని కొందరు కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోవడం లేదట. అందుకే వంశీ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల వ్యవహర శైలి కరెక్టే అనే వాదన కూడా వినిపిస్తుంది.
పొలిటికల్ ఫ్యామిలీ గ్రౌండ్ ఉన్న వంశీనే కాదు.. గతంలో ఇదే స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన బాల్క సుమన్ ప్రోటో కాల్ విషయంలో ఫుల్ గరమయ్యారు. కరీంనగర్ ఎంపీగా మొదటిసారి గెలిచిన సమయంలో బండి సంజయ్ సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీకి ప్రోటోకాల్ ఇవ్వరా? అంటూ బండి సంజయ్ అధికారులను నిలదీయడం అప్పట్లో హట్ టాపిక్ అయ్యింది. అప్పటి నుంచి ప్రోటోకాల్ పాటించడం మొదలు పెట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యేల సూచనల మేరకే అధికార యంత్రంగం నడుచుకుంటుందని.. ఎంపీలకు ప్రయార్టీ ఇవ్వడం లేదనేది ఓపెన్ టాక్.
మరి వంశీకృష్ణ ప్రోటోకాల్ విషయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సభలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈ విషయంలో సీఎం యాక్షన్ తీసుకుంటారా.. వంశీకి రాబోయే రోజుల్లో మర్యాద దోరుకుతుందో లేదో చూడాలి.
ఢిల్లీకి విడివిడిగా రేవంత్, భట్టి.. ఎవరికి వారు వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి?