వెంకట్రామిరెడ్డి ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతా: రఘునందన్ రావు

పార్లమెంట్ సమావేశాల అనంతరం తన కార్యాచరణ ప్రారంభిస్తానని తెలిపారు.

Raghunandan Rao

ఇందిరమ్మ గెలిచిన నియోజక వర్గం, కేసీఆర్ పుట్టిన ఇల్లు అయిన మెదక్ నియోజకవర్గంలో తాను గెలవడం చారిత్రాత్మకమని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మొదట కలెక్టర్‌గా చేసి అనంతరం ప్రజాప్రతినిధిగా మారిన వెంకట్రామిరెడ్డి ధరణి పేరుతో చేసిన మోసాలు బయటపెడతానని చెప్పారు.

ఓ గెస్ట్ హౌస్‌లో ఉండి వివాదాస్పద ల్యాండ్‌ను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారని ఆరోపించారు. లావణ్య పట్టా వంటి పేరుతో బెదిరించి భూములు కొన్ని కంపెనీల పేరుతో లాక్కున్నారని చెప్పారు. గిరిజనుల నుంచి భూములు లాక్కున్నారని అన్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం తన కార్యాచరణ ప్రారంభిస్తానని తెలిపారు.

మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు పెండింగ్ చెక్కులను క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఐఆర్‌లో ఏ పరిశ్రమ వస్తుందనేది ఎక్కడా చెప్పలేదని విమర్శించారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినట్టు జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు.

జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశానని తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీలో సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితిని తన మొదటి ప్రశ్నకే తెచ్చానని అన్నారు. అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకగా నిలిచానని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్వర్యంలో దేశాభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని అన్నారు.

Also Read: వైసీపీకి మరో బిగ్‌షాక్‌.. విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు.. మాజీ మంత్రి ఏం చేశారంటే?

ట్రెండింగ్ వార్తలు