Rahul Gandhi
Rahul Gandhi – Telangana: పార్లమెంటులో బీజేపీ(BJP)కి బీఆర్ఎస్ (BRS) మద్దతు ఇస్తోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కనుసైగ చేయగానే బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని తెలిపారు. అక్కడ 5 గ్యారంటీలు ఇచ్చామని గుర్తు చేశారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణకు 6 హామీలు ఇస్తున్నామని చెప్పారు.
ఈ హామీలను కూడా అమలు చేస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. యువతకు ఉద్యోగాల కోచింగ్ కోసం సాయం చేస్తామని తెలిపారు. యువ వికాస పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డులు అందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెలకు రూ.4,000 చొప్పున అందిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామని చెప్పారు. గృహలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ధరణితో, రైతు బంధుతో బీఆర్ఎస్ మోసం చేసిందని చెప్పారు.
Sonia Gandhi: కర్ణాటకకు అప్పుడు 5 హామీలే.. తెలంగాణకు ఇప్పుడు 6 హామీలు ప్రకటించిన సోనియా