Special Trains : దసరా, దీపావళి వేళ ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు
Special Trains : దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రత్యేక రైళ్లు నడపనుంది.
- Harish Thanniru
- Published on- October 8, 2026 / 02:09 PM IST
Railway Department
Special Trains : దసరా, దీపావళి పండగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగల సమయంలో సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో సాధారణ రైళ్లలో రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయి. అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు, నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. అదేవిధంగా విశాఖపట్నం – బెంగళూరు మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నవంబర్ 25 వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నర్సాపూర్ – తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్ సర్వీసును నవంబర్ 30 వరకు కొనసాగించనున్నారు. అదేవిధంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం రేపు సికింద్రాబాద్, కాకినాడ మధ్య ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది.
పండగ సమయాల్లో రద్దీని తట్టుకునేందుకు, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రైల్వే శాఖ ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
