Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. అప్పటి నుంచి ఈ రైళ్లు రద్దు.. కారణాలివే..
SCR Trains Cancel : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. జులై 28వ తేదీ నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
- Harish Thanniru
- Updated on- June 11, 2026 / 02:30 PM IST
Several Trains Being Cancelled Due to Baleswar Yard Remodeling Work
Trains Cancel : రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్. జులై 28వ తేదీ నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దక్షిణ తూర్పు రైల్వే ఖరగ్‌పూర్ విభాగంలోని బాలేశ్వర్ స్టేషన్‌లో ఆధునీకరణ, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దయ్యే రైళ్లు ఇవే..
- సికింద్రాబాద్ – హౌరా – ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ జూలై 28 నుండి ఆగస్టు 8వ తేదీ వరకు హౌరా- సికింద్రాబాద్ – ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ జూలై 29 నుండి ఆగస్టు వరకు రద్దు చేసినట్లు వెల్లడించారు.
- శాలిమార్ – చర్లపల్లి ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 4 వరకు.. చర్లపల్లి – శాలిమార్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్టు 6 వరకు.. శాలిమార్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 5 వరకు రద్దు చేసినట్లు వెల్లడించారు.
- సికింద్రాబాద్ – శాలిమార్ ఎక్స్‌ప్రెస్ ఆగస్టు 7వ తేదీ వరకు నిలిపి వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైళ్లు ఎప్పటి నుంచి పున: ప్రారంభించేది తేదీలను వెల్లడిస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.
- ఆయా మార్గాల్లో, ఈ రైళ్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. నాన్ ఇంటర్ లాకింగ్ పనులు పూర్తి కాగానే తిరిగి ఈ రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు.
