Gold Price Fall : తులం బంగారం ధర రూ. లక్షకు పడిపోతుందా..! నిపుణులు చెప్పే కారణాలివే.. వెండి ధరకూడా భారీ తగ్గబోతుందంట..
Gold Prices Drop : బంగారం, వెండి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అయితే, ఈ నెలాఖరు నాటికి తులం గోల్డ్ రేటు రూ.లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనేక కారణాలను వారు వెల్లడిస్తున్నారు.
Gold And Silver Prices Droped Will Gold Price Reach One Lakh
- బంగారం, వెండి ప్రియులకు శుభవార్త
- భారీగా తగ్గుతున్న ధరలు
- ఈనెలాఖరు నాటికి గోల్డ్ రేటు లక్షకు పడిపోతుందా
- నిపుణులు చెప్పే కారణాలు ఇవే
Gold Prices Drop : బంగారం, వెండి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గోల్డ్ రేటు క్రమంగా తగ్గుతోంది. బుధవారం బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. పరిస్థితులు ఇలానే కొనసాగితే జూన్ చివరి నాటికి తులం బంగారం ధర రూ.లక్షకు చేరుతుందని, వెండి ధర భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బుధవారం నమోదైన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ 150 డాలర్లు తగ్గింది. దీంతో ఔన్సుగోల్డ్ 4,109 డాలర్లకు పడిపోయింది. దేశంలోనూ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ.3,950 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.4,300 తగ్గుదల చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే జూన్ చివరి నాటికి తులం బంగారం రేటు లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకుగల కారణాలను నిపుణులు వెల్లడిస్తున్నారు.
ముఖ్యంగా బంగారం ధర తగ్గడానిక అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా డాలర్ బలోపేతం కావడం, ముడి చమురు ధరలు పెరగడం వల్ల బంగారం, వెండి మార్కెట్లపై ఒత్తిడి పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. దీని ప్రభావంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువకాలం పాటు హెచ్చులోనే ఉంచవచ్చుననే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
డాలర్ బలపడుతుండటం వల్ల ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం, వెండి మరింత ఖరీదుగా మారుతాయి. దీంతో విలువైన బంగారం కు డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు.. అధిక వడ్డీ రేట్లు పెట్టుబడిదారులను వడ్డీ వచ్చే ఆస్తులవైపు ఆకర్షించడంతో బంగారం వైపు ఆకర్షణ కొంత తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పలు కారణాల వల్ల జూన్ నెల చివరి నాటికి లేదంటే జులై నెలలో తులం గోల్డ్ ధర రూ.లక్షకు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
