Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు చెప్పారు.

Rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. ఈ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్

Rains

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ ‌చేశారు.

కాగా, నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. అవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో మరి కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. వచ్చే నెల 8 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి.

ఎండాకాలం ముగియకముందే జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతుంటే, మరికొన్ని ప్రాంతాల వారు వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా ఈ సారి త్వరగా వస్తున్నాయి.

ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదు: జగ్గారెడ్డి