weather: తెలంగాణలో తేలికపాటి వర్షాలు
మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
- Narender Thiru
- Published On : April 26, 2022 / 03:12 PM IST
Weather
weather: తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. మంగళవారం ఉదయం అంచనా ఆధారంగా వాతావరణ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
బుధ, గురు వారాల్లో ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు, సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపింది.
