×
Ad

Raja Singh : కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సంచలన కామెంట్స్.. కాంగ్రెస్‌ను గెలిపిస్తారా..? బీఆర్ఎస్ పార్టీనా..? ఎవర్ని సర్ అంటూ..

Raja Singh : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డిపై ఆ పార్టీ మాజీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Raja Singh

Raja Singh : కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి (Kishan Reddy) పై ఆ పార్టీ మాజీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్లమెంట్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవర్ని గెలిపిస్తారు.. కాంగ్రెస్ పార్టీనా..? బీఆర్ఎస్ పార్టీనా..? అంటూ రాజాసింగ్ ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి జీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు..? తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా..? అంటూ సోషల్ మీడియాలో ప్రజలు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. మీ గౌరవం ప్రమాదంలో ఉంది. మీరు భారీ ఓట్లతో ఓడిపోతే జాతీయ నాయకులకు మీ ముఖం ఎట్లా చూపెడతారు.. కొద్దిగా ఆలోచన చేయండి సర్ అంటూ రాజాసింగ్ సూచించారు.

ప్రతి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతిఒక్క డివిజన్‌లో వేలు పెట్టడం మీకు అలవాటు. నేడు మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలా మంది వేలు పెడుతున్నారు అది తెలుసా మీకు..? నా జిల్లాను సర్వనాశనం చేసి నన్ను బయటకు పంపిస్తున్నారు. ఏదో ఒకరోజు సమయం వస్తుంది.. మీరు కూడా బయటకు వెళ్తారు అంటూ కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.