Colleges Conduct Classes : పిల్లల జీవితాలతో ఆటలా? క్లాసులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై కలెక్టర్ సీరియస్

కరోనా కట్టడి కోసం ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంటే.. మరోవైపు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు మాత్రం యథేచ్చగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నాయి. కరోనా భయమే లేకుండా, నిబంధనలు బ్రేక్ చేసి క్లాసులు నిర్వహిస్తున్నాయి.

Corporate Colleges Conduct Classes : కరోనా కట్టడి కోసం ఓవైపు ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంటే.. మరోవైపు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు మాత్రం యథేచ్చగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. పిల్లల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నాయి. కరోనా భయమే లేకుండా, నిబంధనలు బ్రేక్ చేసి క్లాసులు నిర్వహిస్తున్నాయి. అటువంటి కాలేజీలపై టెన్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించారు. వెంటనే ఆ కాలేజీలను విజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా కాలేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, నిబంధనలు ఉల్లంఘించి క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంది. అయితే కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు ఇవేమీ పట్టన్నట్టు యథేచ్చగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీల గురించి టెన్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులను ఉన్న ఫళంగా బ్యాక్ డోర్ నుంచి పంపేశాయి. విద్యార్థులు తమ బ్యాగులు, బుక్కులు క్లాస్ రూమ్ లోనే వదిలేసి వెళ్లిపోయారు.

ట్రెండింగ్ వార్తలు