Registration services suspended : ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్.. ఈ తేదీల్లో సేవలు బంద్.. కారణం ఇదే..
Registration services suspended : తెలంగాణలోని ప్రజలకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ సేవలు బంద్ కానున్నాయి.
- Harish Thanniru
- Published on- June 19, 2026 / 09:40 AM IST
Registration services suspended in Telangana
- తెలంగాణలో మూడ్రోజులు రిజిస్ట్రేషన్లు బంద్
- ఈనెల 26 నుంచి 28 వరకు నిలిపివేత
- 29వ తేదీ నుంచి మళ్లీ యథావిధిగా రిజిస్ట్రేషన్లు
Registration services suspended : తెలంగాణలోని ప్రజలకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రకటించింది. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సేవలను నిలిపివేసింది. సర్వర్ అప్ గ్రేడేషన్, సాంకేతిక నిర్వహణ పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు.
Also Read : Fuel Curbs Removal India : రైతులకు భారీ ఊరట.. సాగు ప్రారంభ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న ధరలు..!
దాదాపు ఐదేళ్ల తరువాత సర్వర్లను పూర్తిస్థాయిలో అప్ గ్రేడ్ చేస్తున్నామని, ఈ పనులు పూర్తయిన తరువాత రిజిస్ట్రేషన్ సేవలు మరింత వేగవంతంగా, సురక్షితంగా అందుబాటులోకి వస్తాయని, సర్వర్ల పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడుతుందని రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మూడు రోజులపాటు రాష్ట్రంలోని అన్ని సబ్ – రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్థలాలు, ఇళ్ల ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిర్వహించరని, అలాగే శాఖా అధికారిక వెబ్ సైట్ తోపాటు ఆన్ లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండవని తెలిపారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన ప్రజలు జూన్ 26కు ముందే తమ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. జూన్ 29వ తేదీ నుంచి అన్ని రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు.
