ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ పట్టాభిరామ్ ప్రసిద్ధి పొందారు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఆయన ఎన్నో పుస్తకాలు రచించారు. ప్రశాంతి కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా వేలాది మంది మానసిక రోగులకు చికిత్స అందించారు. ఎంతో మందిని ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడేశారు.
డాక్టర్ బీవీ పట్టాభిరామ్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా తన వ్యక్తిత్వ వికాస పాఠాలతో వేలాదిమందికి మార్గదర్శకుడిగా నిలిచారు. హిప్నాటిజం, వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్య పరిరక్షణ వంటి రంగాల్లో లోతుగా పరిశోధనలు చేశారు. యువతలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎన్నో శిక్షణా శిబిరాలు నిర్వహించారు.
బీవీ పట్టాభిరామ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు స్పందించారు. “ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మృతి నన్ను బాధించింది. వ్యక్తిత్వ వికాస బోధనలతో, రచనలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన శ్రీ బీవీ పట్టాభిరామ్ మృతి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను” అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
“ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మెజీషియన్ బీవీ పట్టాభిరామ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మెజీషియన్‌గా, హిప్నాటిస్టుగా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్‌గా బీవీ పట్టాభిరామ్ ఎనలేని సేవలు అందించారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు శ్రీ బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మృతి నన్ను బాధించింది. వ్యక్తిత్వ వికాస బోధనలతో, రచనలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన శ్రీ బీవీ పట్టాభిరామ్ మృతి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు… pic.twitter.com/KcWmstMdKT
— N Chandrababu Naidu (@ncbn) July 1, 2025