Revanth Reddy: వాళ్లకు ఓట్లు మాత్రమే కావాలి, కానీ..: రేవంత్ రెడ్డి ఫైర్
రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు.
- T Venkateshwarlu
- Updated on- February 10, 2026 / 11:04 AM IST
Revanth Reddy
Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ నేతలకు ఓట్లు కావాలి కానీ, ప్రజల సమస్యలను ఏనాడైనా పట్టించుకున్నారా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇవాళ రేవంత్ రెడ్డి పర్యటించారు. నారాయణపూర్ సమీపంలో నిర్వహించిన “ప్రజా పాలన-ప్రగతి బాట” బహిరంగ సభకు హాజరయ్యారు. బహిరంగ సభలో “ప్రజా పాలన”పై ప్రసంగించారు.
Also Read: పాకిస్థాన్‌కు అమెరికా ఝలక్.. పీవోకేను భారత భూభాగంగా చూపుతూ మ్యాప్ విడుదల.. ఇకపై..
రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర బీఆర్ఎస్ పదేళ్లు, కేంద్రంలో బీజేపీ 12 ఏళ్లు అధికారంలో ఉన్నాయని, ఆయా పార్టీల నేతృత్వంలోని గత ప్రభుత్వాలు మున్సిపాలిటీలను నిర్లక్ష్యం చేశాయని అన్నారు.
“ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం రూ.38 వేల కోట్లతో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి పూనుకున్నారు. అప్పులు ఉన్నప్పటికీ మేము ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గత పాలకులు చేసిన తప్పులను సరిస్తూనే పాలనను కొనసాగిస్తున్నాం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.
