Revanth Reddy Warns BJP : మిత్తితో సహా చెల్లిస్తాం, జైలుకెళ్లక తప్పదు- బీజేపీకి రేవంత్ రెడ్డి వార్నింగ్

బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి, ఇంతకు ఇంత మిత్తితో సహా చెల్లిస్తాం. అధికారం శాశ్వతం కాదు. రేపటి రోజున జైలుకు పోయే పరిస్థితి వస్తుంది.(Revanth Reddy Warns BJP)

Revanth Reddy Warns BJP : నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తెలంగాణ పీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వం టార్గెట్ గా చెలరేగిపోయారు. ఈడీ ఆఫీస్ ముందు ధర్నాలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేంద్రంలో అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.

దేశ స్వాతంత్ర్యం కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను 1937లో నెహ్రూ ప్రారంభించారని రేవంత్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్రం ఆనంతరం అప్పులతో పత్రిక మూతపడిందన్నారు. దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని తిప్పికొట్టడానికి నేషనల్ హెరాల్డ్ పేపర్ కు కాంగ్రెస్ ఊపిరి పోసి పున: ప్రారంభించిందన్నారు. లాభాపేక్ష లేని యంగ్ ఇండియా సంస్థలు ప్రభుత్వం నుంచి లబ్ది పొందలేదన్నారు.(Revanth Reddy Warns BJP)

Revanth Reddy National Herald : నాడు ఇందిర, నేడు సోనియా.. 2024లో రిపీట్ కాబోతోందన్న రేవంత్ రెడ్డి

బీజేపీ దుర్మార్గాలను నేషనల్ హెరాల్డ్ పేపర్ బయటపెడుతోందని, అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్లినా, మనీ లాండరింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తేల్చిందన్నారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భయం బీజేపీ లో మొదలైందని, అందుకే మూసేసిన కేసులో నోటీసులు ఇచ్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

5 గంటల వరకే విచారణ ముగించాల్సిందని, కానీ, ఈడీ ఆఫీసులో రాహుల్ గాంధీని 12 గంటల పాటు కూర్చోబెట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇది మోదీకి తగునా? ఓ ఎంపీని, ఓ పార్టీ అధ్యక్షుడిని ఇన్ని గంటలు ఎందుకు విచారణ చేయాలి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తల్లి హాస్పిటల్ లో ఉంటే, కొడుకును గంటల కొద్ది విచారణ పేరుతో ఉంచారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, ఇంత బరితెగింపు మంచిది కాదని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఈ దేశ భవిష్యత్ కోసం తన రక్తాన్ని ధారపోయడానికి సిద్ధమని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

National Herald case : నేషనల్ హెరాల్డ్ కేసుకు FIR కూడా లేదు..అదొక చిత్తుకాగితం : రేవంత్ రెడ్డి

బీజేపీ నేతలు గుర్తు పెట్టుకోవాలి, ఇంతకు ఇంత మిత్తితో సహా చెల్లిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, అధికారులు గుర్తు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలు చెప్పినట్లు వింటే.. రేపు అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. 300 సీట్లతో కేంద్రం లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తక్షణమే కేసును ఉపసంహరించుకుని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ తీరు మారకుంటే.. ఈ నెల 23న ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీస్ ను తెలంగాణ బిడ్డలు ముట్టడిస్తారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు