Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
యాదాద్రి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ..
- Harish Thanniru
- Published on- December 7, 2024 / 07:39 AM IST
Road Accident
Yadadri district Tragedy: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. శనివారం తెల్లవారు జామున భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెం నుంచి పోచంపల్లి వైపు నేషనల్ హైవేపై వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు చెరువులోకి దూసుకెళ్లిన కారును బయటకు తీశారు. అప్పటికే అందులోని ఐదుగురు వ్యక్తులు మరణించినట్లు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అతివేగంతోపాటు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారని, మృతులు హర్ష, దినేశ్, వంశీ, బాలు, వినయ్ గా పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను వెలికితీసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
