Rowdy Sheeters In Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీషీటర్లు.. యువకులను నగ్నంగా వీడియోలు తీస్తున్న గ్యాంగులు
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్లు రెచ్చి పోతున్నారు. మాట వినని వారిపై రోడ్లపై వెంటాడి దాడులు చేస్తున్నారు. చంద్రాయన్ గుట్టలతో రౌడీ షీటర్ల ఆగడాలు మరీ పెరిగిపోయాయి.
- bheemraj
- Published On : January 23, 2023 / 02:50 PM IST
Rowdy sheeters
Rowdy Sheeters In Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్లు రెచ్చి పోతున్నారు. మాట వినని వారిపై రోడ్లపై వెంటాడి దాడులు చేస్తున్నారు. చంద్రాయన్ గుట్టలతో రౌడీ షీటర్ల ఆగడాలు మరీ పెరిగిపోయాయి. ఈ ప్రాంతంలో రౌడీ షీటర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోది. తన మాట వినకపోతే కిడ్నాప్ చేసి గదిలో బంధిస్తున్నారు. యువకులను కత్తులతో బెదిరించి నగ్నంగా వీడియోలో తీస్తున్న రౌడీ గ్యాంగ్ లు సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నారు.
ఇక రౌడీ షీటర్ల ఆగడాలపై యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాతబస్తీలో రౌడీ షీటర్లకు సంబంధించి ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, వారి ఆగడాలు కూడా మితి మీరిపోతున్నాయన్న కంప్లైంట్ పోలీసులకు వచ్చింది. వారంతా కూడా ఆధీపత్యం చెలాయించడానికి రౌడీ షీటర్ల గ్రూప్ ల మధ్య తగాదాల కోసం యువకులంతా డిస్ట్రర్బ్ అవుతున్నారు.
హైదరాబాద్ లో కత్తులతో పరస్పర దాడి.. ఇద్దరు రౌడీ షీటర్ల హత్య
వారితో నగ్నంగా డ్యాన్స్ లు చేయించడం, కత్తులతో బెదిరించడం వంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో స్థానికులు భయభ్రాంతలకు గురవుతున్నారు. వారి సెటిట్ మెంట్లు, వ్యహారాలకు సామాన్యులు బలవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రౌడీ గ్యాంగ్ చెప్పిన మాట వినకపోతే కచ్చితంగా వారిని కిడ్నాప్ చేసి బెదిరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.
