హైదరాబాద్ లో కత్తులతో పరస్పర దాడి.. ఇద్దరు రౌడీ షీటర్ల హత్య

  • Edited By: bheemraj , June 5, 2020 / 10:20 PM IST
హైదరాబాద్ లో కత్తులతో పరస్పర దాడి.. ఇద్దరు రౌడీ షీటర్ల హత్య

హైదరాబాద్ లో మరో ఇద్దరు హత్యకు గురయ్యారు. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలివ్ ఆస్పత్రి వద్ద రౌడీ షీటర్లు చాందీ, అబూ గొడవ పడ్డారు. పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. 

వెస్టు జోన్ లోని లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నడిరోడ్డుపై రౌడీ షీటర్ల గ్యాంగ్ లు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. మహ్మద్ చాందీతోపాటు అబూ అనే ఇద్దరు రౌడీ షీటర్లు సంఘటనాస్థలంలో అక్కడికక్కడే మృతి చెందారు. రౌడీ షీటర్ల మధ్య ఆధిపత్యపోరు, పాత కక్షల కారణంగానే పరస్పరం హత మార్చుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

చాందీ, అబూ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష దాడులకు పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకునేందుకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, లంగర్ హౌజ్ పోలీసులు రంగంలోకి దిగారు. 
Read: తెలంగాణలో తొలిసారిగా స్నేక్‌ రెస్క్యూ సెంటర్‌