Lb Nagar Hoppital Corona Dead Body
Hospital game with corona Body: ఈ కరోనా కాలంలో కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా మృతదేహాలను అడ్డం పెట్టుకుని క్యాష్ చేసుకుంటున్నాయి. కరోనా సోకి చనిపోయిన మృతుల బంధువులు కంటికి కడివెడు కన్నీళ్లతో ఏడుస్తుంటూ ఆస్పత్రులు మాత్రం డెడ్ బాడీలతో గేములాడుతున్నాయి. లక్షలకు లక్షలు డబ్బులు కడితేనే బంధువులకు మతదేహాలను ఇస్తామని బేరం పెడుతున్నాయి. దీంతో కరోనా కాలంలో శవరాజకీయాలతో ఆస్పత్రులు కాసుల ఆటలు ఆడుతున్నారు. మృతుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. డెడ్ బాడీ కావాలంటే లక్షలు కుమ్మరిస్తేనే గానీ ఇచ్చేది లేదని చెబుతున్నారు. దీంతో ఆత్మీయుల్ని కోల్పోయినందుకు ఏఢ్వాలో..ఆస్పత్రులు ఆడుతున్న కాసుల కక్కుర్తికి అంత డబ్బు కట్టలేక ఏడవాలతో తెలియని కష్టాల సుడి గుండాల్లో పడి ఆవేదన చెందుతున్నారు.
సరిగ్గా ఇటువంటి దారుణానికే పాల్పడింది హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రి. ఎల్బీనగర్ లోని సుప్రజ ఆస్పత్రి యాజమాన్యం. కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన మృతదేహాన్ని మూడు రోజుల నుంచి ఆస్పత్రి సెల్లార్ లోనే పెట్టి బంధువులు ఆరు లక్షల రూపాయలు కడితేనే డెడ్ బాడీని ఇస్తామంటూ చెబుతోంది. ఏప్రిల్ 17న కరోనా సోకి డెవిల్ అనే వ్యక్తి సుప్రజ ఆస్పత్రిలో చేరాడు. అతనికి చికిత్సనందించినా ఫలితం లేక 25తేదీన డెవిల్ ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే ఆరు లక్షల రూపాయలు చెల్లించాలని లేదంటే డెడ్ బాబీని ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. డెడ్ బాడీని ఇచ్చేది లేదని తేల్చి చెబుతోంది సుప్రజ ఆస్పత్రి యాజమాన్యం. మతదేహాన్ని ఆస్పత్రి సెల్లార్ లోనే గత మూడు రోజులుగా ఉంచింది. దీంతో ఆరు లక్షలు కట్టలేని స్థితిలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని బతిమాలుకున్నారు. కానీ సుప్రజ ఆస్పత్రి కాసుల కక్కుర్తితో వ్యవహరిస్తున్న తీరుకు అటు కుటుంబ సభ్యుడ్ని కోల్పోయి ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు.
కాగా..సుప్రజ ఆస్పత్రిలో అచ్చు ఠాగూర్ సినిమాలో సీన్ ను తలపించేలా సంఘటన జరిగింది. డెవిల్ చనిపోయి మూడు రోజులు గడిచిని అతనికి సీరియస్ గా ఉందని వెంటనే ఆరు లక్షల రూపాయలు కట్టాలని లేదంటే చనిపోతాడని ఆస్పత్రి యాజమాన్యం నాటకాలు ఆడింది. అప్పటికే చనిపోయిన డెవిల్ మృతదేహాన్ని ఆస్పత్రి సెల్లార్ లో ఉండి కుటుంబ సభ్యులకు మాత్రం అతనికి సీరియస్ గా ఉంది వెంటనే డబ్బులు కట్టాలని చెబుతోంది. కానీ అసలు విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళనచేపట్టారు.