RS Praveen Kumar : రానున్న రోజుల్లో కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తాను : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్

RS Praveen Kumar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించానన్నారు. కేసీఆర్‌కు పొత్తుపై మాట ఇచ్చాను.. అందుకే మాట తప్పనని స్పష్టం చేశారు.  

RS Praveen Kumar Comments About Resign to BRS Party After Meet With KCR

RS Praveen Kumar :  బీఎస్పీకి చాలా బాధతో రాజీనామా చేశానని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసీఆర్‌కు పొత్తుపై మాట ఇచ్చాను.. అందుకే మాట తప్పనని పేర్కొన్నారు.  శనివారం (మార్చి 16) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రయోజనాల కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్ తో చర్చించానన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌తో, బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేస్తానని తెలిపారు.

తన శ్రేయోభిలాషులతో చర్చలు జరిపిన అనంతరం రాజకీయంగా నిర్ణయం తీసుకుంటానని ప్రవీణ్ కుమార్ చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయడమే కాకుండా 107 అభ్యర్థులను బరిలో నిలిపినట్టు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కాకుండా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నామని, ఈ విషయంలో అందరితో చర్చించి బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై నిర్ణయం తీసుకున్నామన్నారు.

బీజేపీ ఒత్తిడితోనే పొత్తు రద్దు : 
బీఎస్పీకి కేసీఆర్ రెండు సీట్లు కేటాయించారని, దీనికి బీఎస్పీ జాతీయ నాయకత్వం సైతం అంగీకరించిందని చెప్పారు. అయితే, బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు నచ్చని బీజేపీ.. బీఎస్పీపై ఒత్తిడి తీసుకువచ్చి పొత్తును రద్దు చేశారని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరి పొత్తును రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని బీఎస్పీ హై కమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. దేశంలో బీజేపీ గేలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని అంటున్నారని తెలిపారు.

గతంలో ఐపీఎస్ ఆఫీసర్‌గా దేశం కోసం పనిచేశానని చెప్పిన ప్రవీణ్ కుమార్.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నటికీ బహుజన వాదాన్ని వీడనని స్పష్టం చేశారు. మాయావతి ఆశీర్వాదంతో నల్గొండ సభలో బీఎస్పీలో చేరానని, 4,000 గ్రామాల్లో పర్యటనలు చేశానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Read Also : RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం.. బీఎస్పీకి రాజీనామా.. కేసీఆర్‌తో భేటీ

ట్రెండింగ్ వార్తలు