Rythu Bharosa 2026 : రైతు భరోసాపై కీలక అప్డేట్.. మరో 3 రోజులే ఉంది.. త్వరగా అప్లై చేసుకొండి
Rythu Bharosa 2026 : రైతు భరోసా పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. మరో మూడు రోజులు మాత్రమే అవకాశం ఉంది.
- Dharani Pilli
- Published On : March 23, 2026 / 06:42 AM IST
rythu bharosa for yasangi season 2026 opens applications for new farmers within march 25
Rythu Bharosa 2026 : తెలంగాణ రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తోన్న రైతు భరోసా పథకంపై ప్రభుత్వం ముందడుగు వేసింది. మార్చి 22 ఆదివారం నాడు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. నేటి నుంచి రైతుల ఖాతాలో ఈ మొత్తం జమకానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతు భరోసా పథకం కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయించారు. ఇక నేటి నుంచి అర్హులైన రైతుల ఖాతాలో సాగు చేసే భూములకు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. ఇదిలా ఉంటే రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి సర్కార్ మరో అవకాశం కల్పించింది. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
రైతు భరోసా పథకం(యాసంగి)-2026 కింద లబ్ధి పొందేందుకు గాను నూతన దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలానే ఇప్పటికే అప్లై చేసుకున్న వారు, రైతు భరోసా పొందుతున్న వారు.. వారి బ్యాంకు వివరాల అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తే.. అందుకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఈక్రమంలో 2026, ఫిబ్రవరి 28 వరకు కొత్త పట్టాదారు పాసుపుస్తకం పొంది.. రైతు భరోసాకు అర్హతలు ఉన్న అన్నదాతలు ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నా ఇప్పటి వరకు రైతు భరోసాను పొందని వారు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
కావాల్సినవి..
- రైతు భరోసా దరఖాస్తు ఫారం
- పట్టాదార్ పాసుపుస్తకం లేదా తహసీల్దారు డిజిటల్ సంతకం ఉన్న పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు
- బ్యాంకు పాసుపుస్తకం ఫస్ట్ పేజీ
- రైతు నామినీ (భార్య/భర్త/కుమారుడు) ఆధార్ జిరాక్స్, మొబైల్ నెంబరు.
- రైతు వేదికలో ఏఈవో వద్ద దరఖాస్తు చేసుకోవాలి.
- కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన వారితో పాటు గతంలో అర్హత ఉండి చేసుకోని వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- భూ విస్తీర్ణం వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి.
- దరఖాస్తుకు చివరి తేదీ: 25.03.2026
