Adilabad : అన్నా.. నేను నీవెంటే
అన్న మృతి చెందిన గంటల వ్యవధిలో సోదరి కూడా మృతి చెందింది.. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ లో మంగళవారం జరిగింది.
- kunduru Vinod
- Published On : November 10, 2021 / 09:40 AM IST
Adilabad (2)
Adilabad : అన్న మృతి చెందిన గంటల వ్యవధిలో సోదరి కూడా మృతి చెందింది.. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ లో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన నర్వటె మారుతి (60) మంగళవారం తెల్లవారు జామున గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అదే గ్రామంలో ఉండే తన చెల్లెలు మస్కె రేణుక (48) మరణ వార్త తెలిసి పరుగుపరుగున అన్న ఇంటికి చేరుకుంది.
చదవండి : Adilabad : ప్రజలను బెంబేలేత్తిస్తున్న బెబ్బులి
మృతదేహం వద్ద రోదిస్తూ స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు. ఒకే రోజు అన్న చెల్లలు మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక కుటుంబ సభ్యులు వీరికి అన్నాచెల్లెలిద్దరికీ ఒకేచోట అంత్యక్రియలు పూర్తిచేశారు.
చదవండి : Adilabad : రెండేళ్ల ప్రేమ.. ప్రియుడి మాటకు మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య
