Adilabad : ప్రజలను బెంబేలేత్తిస్తున్న బెబ్బులి | People in Adilabad district are afraid of tiger poaching

Adilabad : ప్రజలను బెంబేలేత్తిస్తున్న బెబ్బులి

ఆదిలాబాద్ జిల్లాను పెద్దపులులు భయపెడుతున్నాయి. అడవిలో ఉండాల్సిన బెబ్బులి జనావాసాల్లోకి వచ్చి ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

Adilabad : ప్రజలను బెంబేలేత్తిస్తున్న బెబ్బులి

Adilabad : ఆదిలాబాద్ జిల్లాను పెద్దపులులు భయపెడుతున్నాయి. అడవిలో ఉండాల్సిన బెబ్బులి జనావాసాల్లోకి వచ్చి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. గత కొద్దీ నెలలుగా పెద్దపులుల సంచారం అధికమైంది. ఇవి ప్రధాన రహదారుల వెంట నడుస్తూ వాహనదారులను భయపెడుతున్నాయి. ఇక తాజాగా బోథ్ మండలం సోనాల గ్రామంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ప్రధాన రహదారిపై దర్జాగా సంచరిస్తూ గ్రామస్తుల కంట పడింది పెద్దపులి. దానిని చూసిన ప్రజలు బెంబేలెత్తిపోయారు.

చదవండి : Adilabad : రెండేళ్ల ప్రేమ.. ప్రియుడి మాటకు మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య

సోనాల గ్రామ ప్రజలతో పాటు.. సమీప గ్రామాల ప్రజలు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి తమ గ్రామాల్లోకి వస్తుందేమో అని భయపడిపోతున్నారు సోనాల, సాకెరా, ఘనపూర్ గ్రామస్తులు. తమ గ్రామాల్లో పులి ఆనవాళ్లు కనిపించాయంటూ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. జనావాసాల్లో తిరుగుతున్న పెద్దపులిని బంధించాలని వారు వేడుకున్నారు.

చదవండి : Tiger Died : వేటగాళ్ల ఉచ్చులోపడి పెద్దపులి మృతి

తమ ప్రాణాలకు పెద్దపులితో ముప్పు ఉందని.. వ్యవసాయ పనులకు వెళ్లేందుకు భయంగా ఉందని.. కూలీలు కూడా రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో పులి మనుషులపై దాడి చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి.

×